calender_icon.png 1 January, 2026 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏందీ బాసూ సంగతి.. అదిరిపోద్ది సంక్రాంతి

31-12-2025 01:24:39 AM

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కలిసి నటిస్తున్న తాజాచిత్రం ‘మన శంకరవర ప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్‌స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గరపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్‌ను చిత్రబృందం మంగళవారం విడుదల చేసింది.

గుంటూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో నిర్వహించిన ఈ ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి, కొరియోగ్రాఫర్ వవిజయ్ పోలాకి హాజరయ్యారు. భీమ్స్ సిసిరోలియో స్వరపర్చిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా నక్ష్ అజీజ్, విశాల్ దద్లాని ఆలపించారు.

‘హే మార్నింగే గ్రీన్ టీ.. నైటైతే నైంటీ.. ఎవడైతే ఏంటీ కుమ్మేద్దాం చంటి.. హే వెంకీ.. ఇచ్చేయ్యి దమ్కీ.. హే స్పీడేమో ఫైవ్‌జీ.. స్టులేమో జెన్‌జీ.. వారెవ్వా సర్‌జీ.. వీ ఆర్ సో క్రేజీ.. హే బాసూ.. పెంచెయ్యి బేసూ.. అన్నా నువ్వూ నెక్స్ లెవల్.. తమ్మీ నువ్వు బెస్ట్ లెవల్.. నువ్వూనేనూ వేరే లెవల్.. ఇద్దరి కాంబో పీక్స్ లెవల్.. ఏందీ బాసూ సంగతి.. అదిరిపోద్ది సంక్రాంతి.. అరే ఏందీ వెంకీ సంగతి.. ఇరగదీద్దాం సంక్రాంతి’ అంటూ సాగుతోందీ పాట. ఈ పాటలోని ప్రతి బీట్ పండుగ ఉత్సాహాన్ని తాకేలా ఉంది.

ఈ ట్రాక్ ఒక విజువల్ ఫీస్ట్, మ్యూజికల్ ట్రీట్.. ఫ్యాన్స్‌కి పర్ఫెక్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటింగ్, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్షన్‌ను పర్యవేక్షిస్తున్నారు.