28-08-2024 12:21:09 AM
జస్టిస్ హేమ కమిటీ రూపొందించిన నివేదిక మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై అధ్యయనం చేసిన కమిటీ.. కాస్టింగ్ కౌచ్ నుంచి వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం నిజమేనని తేల్చి చెప్పింది. వేధింపుల నివేదిక నేపథ్యంలో ఇప్పటికే డైరెక్టర్ రంజిత్ బాలకృష్ణన్.. కేరళ స్టేట్ చలనచిత్ర అకాడమీ అధ్యక్ష్య పదవికి రాజీనామా చేశారు.
అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (ఏఎంఎంఏ)కు ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన నటుడు, నిర్మాత సిద్ధిఖీ తన పదవికి రాజీనామా చేయగా.. తాజాగా ఏఎంఎంఏ అధ్యక్షుడు మోహన్‌లాల్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతోపాటు 17 మంది సభ్యులున్న పాలక మండ లి మొత్తం పదవుల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటిస్తూ రాజీనామాలు సమర్పిం చింది. కమిటీ సభ్యుల్లో కొందరిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహి స్తూ ఏఎంఎంఏ ఎగ్జిక్యూటివ్ కమిటీని రద్దు చేస్తున్నట్టు మోహన్‌లాల్ పేర్కొన్నారు. మరో 2 నెలల్లో ఎన్నికలు నిర్వహించి, కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.