28-08-2024 12:18:55 AM
రాజ్‌తరుణ్ హీరో గా నటిస్తున్న మరో చి త్రం ‘భలే ఉన్నాడే’. మనీ షా కంద్కూర్ కథానాయిక. దర్శకుడు మారు తి సమర్పణలో జే శివసాయివర్ధన్ తెరకెక్కిస్తు న్న ఈ చిత్రాన్ని ఎన్‌వీ కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ మంగళవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. రాజ్‌తరుణ్ మాట్లాడుతూ.. “నాకు డైరెక్టర్ అవ్వాలని ఉంటుంది.
అంతకుముందు నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందన్న విషయం శివసాయి డైరెక్షన్ విధానం చూసిన తర్వాత అర్థమైంది” అన్నారు. ‘ఇందులో రోమాన్స్, కామెడీ అందరికీ నచ్చుతుంది’ అని హీరోయిన్ మనీషా తెలిపింది. డైరెక్టర్ శివ మాట్లాడుతూ.. ‘రాజ్ ఇందులో శారీ డ్రాపర్ క్యారెక్టర్‌లో కనిపిస్తాడు. అమ్మాయికి చీర కట్టాలంటే ఒక కంఫర్ట్బుల్ లెవల్ ఉండాలి. దాని ప్రకారమే ఈ క్యారెక్టర్ లుక్‌ను డిజైన్ చేశాం’ అన్నారు. కార్యక్రమంలో నిర్మాత కిరణ్, సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర పాల్గొన్నారు.