28-08-2024 12:31:25 AM
మాళవిక మోహనన్ కథల ఎంపికలో జోరు చూపిస్తోంది. ఇటీవలే ‘తంగలాన్’లో డీ కనిపించి మెప్పించిన ఈ బ్యూటీ.. సిద్ధాంత్ చతుర్వేదితో జత కట్టిన తాజా చిత్రం ‘యుధ్రా’. రితేశ్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మామ్’ ఫేమ్ దర్శకుడు రవి ఉద్యవార్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ టీమ్ ప్రచారం జోరు పెంచింది. “కోపానికి మరో పేరు వచ్చేసింది.
అదే ‘యుధ్రా” అనే వ్యాఖ్యలు జోడించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటుండగానే ఈ సినిమా నుంచి మరో రెండు పోస్టర్లను చిత్రబృందం విడుదల చేసింది. ఓ పోస్టర్ సిద్ధాంత్‌కు చెందినది కాగా, మరొకటి మాళవికది. కళ్లల్లో నిప్పులు చెరుగుతున్నట్టుగా ఈ పోస్టర్‌లో మాళవిక చూపులతోనే భయపెడుతోంది. కథకు సంబంధించి వివరాలు గోప్యంగా ఉంచుతున్న దర్శక నిర్మాతలు.. ప్రచార పోస్టర్లలో మాత్రం “యుధ్రా’ ఆత్మను మండించే స్పార్క్.. ‘నిఖత్’ అని పేర్కొంటూ నాయకానాయికల క్యారెక్టర్లను వెల్లడించారు. ఈ చిత్రంలో మాళవిక పాత్ర పేరు ‘నిఖత్’ కాగా, మునుపెన్నడూ కనిపించని విధంగా ఇందులో ఆమెను చూడొచ్చని మేకర్స్ తెలిపారు. సిద్ధాంత్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఇదే నెల 29న విడుదల కానుంది.