20-09-2025 12:00:00 AM
న్యాయం కోసం రైతు విద్యుత్ స్థంభం ఎక్కి నిరసన
మంచిర్యాల, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో విద్యుత్ అధికారుల ఆగడాలు రోజురోజుకు పెట్రేగిపోతున్నాయనడానికి శుక్రవారం దేవులవాడ సబ్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటనే నిదర్శనం. విద్యుత్ మీటర్ కోసం వినియోదారుడు దరఖాస్తు చేసుకోమని, అంతా నేను చూసుకుంటానని చెప్పిన లైన్ మెన్ తర్వాత ఇది లేదు.. అది లేదు అంటూ డబ్బులు తీసుకొని తాత్కాలిక ఏర్పాట్లు చేసి వినియోగదారుడికి ఉపశమనం కల్పించాడు. ఇంతవరకు బాగానే ఉన్నా డాబా నిర్వాహకులలో వచ్చిన మనస్పర్ధలు గందరగోళానికి దారితీసాయి.
ఒక మీటర్ 3 కనెక్షన్లు...
దేవులవాడ సబ్ స్టేషన్ పరిధిలోని రాపనపల్లి గ్రామశివారు ప్రాంతమంతా వ్యవసా య భూమి కావడంతో అక్కడ అగ్రికల్చర్ ట్రాన్స్‌ఫార్మర్లు మాత్రమే ఉండడంతో విద్యుత్ కోసం లెన్మైన్‌ను సంప్రదించి కమర్షియల్ విద్యుత్ మోటార్‌కు దరఖాస్తు చేసు కున్నారు. డిటిఆర్ కోసం రాజవ్వ, సమ్మ య్య, రమేష్‌లు కలిసి రాజవ్వ పేరిట దాదా పు రూ. 2.10 లక్షల డిడి తీసి ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసుకున్నారు.
రాజవ్వ పేరిట ఉన్న వ్యవసాయ భూమికి ఇంటి నిర్మాణం కోసం నాలా కన్వర్షన్ చేయించుకున్నా రు. మిగతా ఇద్దరి భూమి నాలా కన్వెన్షన్ ఆలస్యమైంది. దీంతో ముగ్గురు కలిసి రాజవ్వ పేరిట మం జూరైన విద్యుత్ మీటర్‌కు లైన్‌మెన్ మిగిలిన ఇద్దరి విద్యుత్ కనెక్షన్ ఇచ్చి బయటకు లాక్ చేసి ఉంచారు.
స్థంభం ఎక్కిన వికలాంగుడు
ఒక మీటర్‌కు మూడు కనెక్షన్లు ఉన్న విషయం బయటకు రావడంతో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు లైన్ ఇన్స్‌పెక్టర్ వినోద్ శుక్రవారం విద్యుత్ కనెక్షన్ తీసేశారు. మీటర్ కోసం డీడీ తీసిన వికలాంగుడైన అల్స రమేష్ ఇది భరించలేక విద్యుత్ స్తం భం ఎక్కి నిరసన తెలిపాడు. గమనించిన స్థానికులు సబ్ స్టేషన్‌కు సమాచారం అందివ్వడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఉన్నతాధికారులు ఈ విషయంలో నాకు న్యాయం చేయాలి అంటూ విలపంచాడు.