14-05-2025 01:28:31 AM
చల్లని కబురు
న్యూఢిల్లీ, మే 13: వడగాలులు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతా వరణ శాఖ చల్లని కబురుచెప్పింది. మంగళవారం మధ్యాహ్నం నైరుతి రుతుపవనాలు అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతానికి చేరుకున్నట్టు ఐఎం డీ వెల్లడించింది. అండమాన్ సరిసరాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది.
రుతుపవనాల రాకతో గత రెండు రోజులుగా నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూ డు, నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనా లు అండమాన్ నికోబార్ దీవులతో పాటు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం వరకు విస్తరించే అనుకూల వాతావరణం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా మే 27 నాటికే నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతుంటాయి. ఈ ఏడాది నాలుగు రోజులు ముందుగానే రుతుపవనాలు కేరళను తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకున్న సమయానికి రుతుపవనాలు వస్తే, సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది. 2009వ సంవత్సరంలో మే 23నే రుతుపవనాలు కేరళను తాకాయి.
ఆ తర్వాత అవి అంత త్వరగా రానున్నట్లు ఈ ఏడాది కూడా అంచనా వేస్తున్నారు. మే 27న రుతుపవనాలు కేరళను తాకనున్నట్టు అంచనా వే స్తున్న నేపథ్యంలో తెలంగాణలో జూన్ తొలివారంలోనే, అంటే దాదాపు 5వ తేదీలోపే రుతుపవనాలు తెలంగాణ సరిహద్దులను తాకుతాయని అంచనా వేస్తున్నారు.