28-11-2025 01:03:05 AM
బూర్గంపాడు, నవంబర్ 27(విజయక్రాం తి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన 52వ రాష్ట్ర స్థాయి బాల వైజ్ఞానిక ప్రద ర్శన ఇన్స్పైర్ అవారడ్స్ మానక్ 2024-25 పోటీల్లో మండలంలోని మోరంపల్లి బంజర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థి ఇట్టి.వర్షిత్ రూపొందించిన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ జిల్లాలో మొదటి స్థానాన్ని సాధించాడు.
ఈ విజయం పాఠశాల ప్రతిష్టను మరింత పెంచడమే కాక, ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచిందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పలు విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు..