calender_icon.png 28 November, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగిత్యాల రోడ్ విస్తరణకు చొరవ తీసుకోవాలి

28-11-2025 01:03:53 AM

ప్రభుత్వ సలహాదారును సుదర్శన్‌రెడ్డిని కోరిన ఎమ్మెల్యే సంజయ్

జగిత్యాల అర్బన్, నవంబర్ 27(విజయ క్రాంతి): జగిత్యాల పట్టణ ప్రజలకు సమస్యాత్మకంగా మారిన యావర్ రోడ్డు విస్తరణకు తగిన చొరవ చూపి సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గు రువారం ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. యావర్ రోడ్ విస్తరణలో నష్టపోయిన బాధితులకు పరిహారం చెల్లించే వి షయంలో హైదరాబాద్ జిహెచ్‌ఎంసి తరహాలో ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ కింద నష్టపరిహా రం ఇచ్చే విధంగా 2023లో జీవో తీసుకురావడం జరిగిందని సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారు.

హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ కింద రోడ్డు వెడల్పు జరిగితే డైరెక్ట్ గా వ్బుసైట్లో పెడితే బిల్డర్స్ మున్సిపల్ వారు తెలియజేసిన ప్రకారం పేమెంట్ చేసి ఆ హక్కును తీసుకొని అక్కడ వారు కన్స్ట్రక్షన్ చేస్తారని వివరించారు.

యావర్ రోడ్డు వెడల్పు విషయంలో సహకరించాలని కోరగా స్పందించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి వెంటనే వారి సహాయకుల్ని పిలిచి ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రి తో మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, తనకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు.