calender_icon.png 15 October, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవలపిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

15-10-2025 01:08:40 AM

బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన 

మేడ్చల్, అక్టోబర్ 14(విజయ క్రాంతి): ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో కానీ ప్రాణంగా పెంచుకుంటున్న కవల పిల్లలను హత్యచేసి ఆపై ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మానగర్ ఫేస్ వన్ లో సాయిలక్ష్మి, అనిల్ కుమార్ దంపతులు నివసిస్తున్నారు.

సాయిలక్ష్మి(27) మంగళవారం తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో తన కవల పిల్లలైన చేతన్ కార్తికేయ(2), లాస్యవల్లి(2) లను గొంతు నులిమి చంపింది. అనంతరం ఆమె తన నివాసం ఉంటున్న ఇంటి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా భర్తతో గొడవలు జరుగుతుండ డంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న బాలానగర్ పోలీసులు వివరాలు సేకరించి, కేసు దర్యాప్తు చేస్తన్నారు.