calender_icon.png 30 July, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లి నేత్రాలు దానం.. ఆదర్శంగా నిలిచిన తనయుడు ప్రశాంత్

29-07-2025 05:29:01 PM

క్యాన్సర్ తో రంగ రాజేశ్వరి మృతి..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి మండలం లంబడి తండాకు చెందిన సామాజిక కార్యకర్త, పాత్రికేయుడు రంగ ప్రశాంత్ తల్లి రాజేశ్వరి క్యాన్సర్ తో మృతి చెందింది. తీరని దుఃఖ సాగరంలోనూ ప్రశాంత్ సామాజిక సేవను మర్చిపోలేదు. తన తల్లి చనిపోయినప్పటికీ మరొకరికి ఆమె కళ్ళను దానం చేసి చూపును ప్రసాదించాలనే సామాజిక సేవా దృక్పథం స్ఫూర్తిగా నిలిచింది. చాలాకాలంగా క్యాన్సర్ తో మృత్యువుతో పోరాడుతున్న తల్లి రాజేశ్వరి సోమవారం సాయంత్రం కన్ను మూసింది. తల్లి రాజేశ్వరి నేత్రాలను రామాయమ్మ ఇంటర్నేషనల్ ఐ బ్యాంకు, ఐ బ్యాంక్ అసోసియేషన్, ఆఫ్ ఇండియా, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారికి దానం చేశారు.

రంగ ప్రశాంత్ కుటుంబ సభ్యులు రంగశంకర్, జవ్వాజి కూమార స్వామి సమక్షంలో రాజేశ్వరి కళ్ళను లయన్ కబ్ల్ కార్యదర్శి ఆదర్శ్ వర్థన్ రాజ్, డాక్టర్ పి ప్రదీప్ కి ఇచ్చారు. ఈ సందర్బంగా లయన్ కబ్ల్ కార్యదర్శి ఆదర్శ్ వర్థన్ రాజ్ మాట్లాడుతు మరణించిన అనంతరం నేత్ర దానానికి అంగీకరించిన రంగ ప్రశాంత్ కుటుంబ సభ్యులకి అభినందనలు తెలిపారు. ఇంకొకరికి కంటి దానం చేసి మరణించిన వ్యక్తి ఇంకోరి కళ్ళు తో చూసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇలా ఆదర్శంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.