29-07-2025 05:25:16 PM
బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మున్న మల్లయ్య యాదవ్..
నూతనకల్ (విజయక్రాంతి): మండల పరిధిలోని తాళ్ల సింగారం గ్రామ పంచాయతీ నూతన భవనంలో శిలాఫలకం పగలగొట్టడంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎటువంటి సంబంధం లేదని ఉద్దేశపూర్వకంగానే మా నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్న మల్లయ్య యాదవ్(BRS Mandal President Munna Mallaiah Yadav) ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలో మాట్లాడుతూ, గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ హయాంలోని నిధులు మంజూరు చేసి భవనాన్ని నిర్మాణం చేశామని అప్పుడు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఉద్దేశాపూర్వకంగా గుర్తుతెలియని దుండగులు పగలగొట్టారని అయినా మేము ఎటువంటి ఆరోపణలు చేయలేదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలతో, నాయకులు వ్యక్తిగత విభేదాల వళ్లే కాంగ్రెస్ కార్యకర్తలే శిలాఫలకాన్ని పగల కొట్టుకొని మాపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధి కోసం క్రమశిక్షణగా పని చేసిందని అన్నారు. గత పది సంవత్సరాలలో నియోజకవర్గం శాంతియుతంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన సంవత్సరానికి మళ్ళీ దాడులు జరుగుతున్నాయని అన్నారు. హత్యా రాజకీయం చేయడం బీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదని అన్నారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ తప్పుడు ఆరోపణలు మానుకోకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ కార్యదర్శి బత్తుల సాయిలు, మాజీ సర్పంచి చూడు లింగారెడ్డి, మాజీ ఎంపీటీసీ గార్దుల లింగరాజు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గాజుల తిరుమలరావు,నాయకులు తాడూరి సైదులు, బత్తుల విద్యాసాగర్, బిక్కి బుచ్చయ్య, బత్తుల విజయ్, మొగుల వెంకన్న, ఉప్పుల వీరు యాదవ్, మహేశ్వరం మల్లికార్జున్, వీరమల్ల యాదగిరి తదితరులు ఉన్నారు.