10-12-2025 01:37:57 AM
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా విజయ్ దివాస్ వేడుకలు
ఆదిలాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ రథసారథి కేసీఆర్ 11 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ ప్రకటన వెలువడేలా చేసిన చారిత్రమైనది ఈరోజు అని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. డిసెంబర్ 9 అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలిచిన రోజని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం విజయ్ దివాస్ వేడు కలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భం గా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి, తెలంగాణ తల్లి విగ్రహాలకు పార్టీ శ్రేణులతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకు న్నారు. ఈ మేరకు జోగు రామన్న మాట్లాడు తూ... కేసీఆర్ ఉక్కు సంకల్పం ముందు కేం ద్రం తలొగ్గి, తెలంగాణ ఏర్పాటును ప్రకటించిన రోజు నేడు పండగల నిర్వహించుకుంటు న్నామన్నారు.
తెలంగాణ ప్రజలు పొందాల్సిన నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఈ ఉద్య మం జరిగిందని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాములో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.