11 May, 2026 | 3:40 AM

ఎమ్మెల్యేకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

11-05-2026 01:51 AM

కొత్తూరు పాలకవర్గం

సత్తుపల్లి మే10(విజయ క్రాంతి) : సత్తుపల్లి శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌కు మాతృ దినోత్సవ సందర్భంగా, కొత్తూరు గ్రామపంచాయతీ సర్పంచ్ అయినంపూడి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ గొర్లమారి రామ్మోహన్ రెడ్డి ఆదివారం వారి స్వగృహానికి వెళ్లి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని తల్లిలా, ప్రేమతో, బాధ్యతలతో సంరక్షిస్తూ, అటు సమాజసేవలను ఇటు కుటుంబ బాధ్యత నిర్వహణలోను అంకిత భావంతో పనిచేస్తూ, అభివృద్ధి తో ముందుకు సాగుతూ, సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందే విధంగా పాలన అందిస్తున్న ఆమెకు భగవంతుడు ఇంకా ఓపిక కలుగజేసి మంచి పరిపాలన అందించాలని, మరెందరకో ఆదర్శంగా నిలవాలని, అభినందనలు తెలియజేశారు.