20-11-2025 08:09:05 PM
దేవాలయంలో పూజలు.... ఎర్నేని యువ సేన సేవా కార్యక్రమాలు
కోదాడ; కోదాడ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎర్నేని వెంకట్ రత్నం బాబు జన్మ దిన వేడుకలు గురువారం కోదాడ పట్టణం లోని ఆయన నివాసం లో ఎర్నేని యువ సేన, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమాను లు కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యువ సేన ఆధ్వర్యం లో దేవాలయం లో పూజలు నిర్వహించారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేక్ కటింగ్ వేడుకల్లో భారీగా పాల్గొని పూల మాలలు బొకే లతో ఎర్నేని కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 5దశాబ్దాలు గా రాజకీయాల్లో ఉంటూ కోదాడ పట్టణ అభివృద్ధి కి బాబు చేసిన కృషి నీ కొనియాడారు.
సర్పంచ్ గా, మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు పార్టీ లో పలు పదవులు చేపట్టి తన దైన శైలి లో పద వులు నిర్వహించి పదవులకు వన్నె తెచ్చారని కొనియాడారు. సినిమా హాల్ బాబు గా జనం లో ఆయన కు ఎంతో అభిమానం ఉందని కోదాడ పట్టానికేకే కాక నియోజక వర్గంలో వ్యాప్తంగా పేరుపొందిన నాయకుడు బాబు అన్నారు. సాదా సీదాగా ఉంటూ , పట్టువదలనీ నైజం, మాట ఇస్తే తప్పకుండా , సహాయం చేసి ప్రజల అభిమానం పొందారని కొనియాడారు. ఎప్పుడు జనంతో మమేకమై జనం మనిషి గా ఉన్న బాబు నిండు నూరేళ్ళు ఆయుర్ ఆరోగ్య లతో ఉండాలని ఆకాక్షించారు. పేదల పెన్నిధి గా, రైతు గా ఎర్నేని వ్యక్తిత్వం ను కొనియాడారు. రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమం లో నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.