20-11-2025 08:11:20 PM
గరిడేపల్లి (విజయక్రాంతి): అనుమానాస్పద స్థితిలో మహిళ మృతిచెందిన ఘటన బుధవారం రాత్రి మండలంలోని గానుబండ గ్రామంలో జరిగింది.ఎస్ఐ చలికంటి నరేష్ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, గరిడేపల్లి మండలంలోని గానుగబండ గ్రామంలో గ్రామానికి చెందిన షేక్ సైదాబీ( 45) ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరికీ వివాహం చేసి గ్రామంలోని భర్తతో కలిసి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది.
బుధవారం రాత్రి అందాజు 8 గంటల సమయంలో చెక్కభజనకు వెళ్లి ఎవరికి చెప్పకుండా ఇంటికి వెళ్లిందని రాత్రి పది గంటల సమయంలో మృతురాలు సైదాబీ అదే గ్రామానికి చెందిన పోకల వెంకటేశ్వర్లు దొడ్డిలో అనుమానస్పదంగా మరణించి ఉండగా పోకల ఆంజనేయులు పశువులకు గడ్డి వేయుటకు వెళ్లి మృతురాలి శవాన్ని చూసి బంధువులకు సమాచారం ఇచ్చారు.మృతురాలి మరణం పై అదే గ్రామానికి చెందిన పాలెల్లి హుస్సేన్ తండ్రి లక్ష్మయ్య అనే వ్యక్తిపై అనుమానం ఉందని మృతురాలి భర్త షేక్ సైదా హుస్సేన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపారు.