20-11-2025 08:14:59 PM
నకిరేకల్ (విజయక్రాంతి): టీజీఎస్ ఆర్టీసీ సూర్యపేట డిపో నుండి కొత్త సర్వీస్ ను ప్రారంభించినట్లు సూర్యపేట డిపో మేనేజర్ జి. లక్ష్మీనారాయణ తెలిపారు. గురువారం నకిరేకల్ పట్టణంలో కొత్త సర్వీస్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్స్ ప్రెస్ సర్వీస్ తుంగతుర్తి నుండి అర్వపల్లి, జాజిరెడ్డిగూడెం, మాధవరం కలాన్ మీదుగా నకిరేకల్ పట్టణానికి చేరుకొని అక్కడినుండి ఆరు గంటలకు హైదరాబాదు వెళ్తుందని, తిరిగి ఉదయం 5:50 కి హైదరాబాదు నుండి బస్సు బయలుదేరి నకిరేకల్ కు వచ్చి అర్వపల్లి మీదుగా తుంగతుర్తి, సూర్యాపేటకు వెళ్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని నకిరేకల్ ప్రాంత ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.