calender_icon.png 24 January, 2026 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒత్తిడిని జయిస్తే విజయం మీదే

24-01-2026 08:08:52 PM

కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ప్రకాష్ బనావత్ 

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): విద్యార్థులు ఒత్తిడిని జయిస్తే విజయం మీ సొంతమవుతుందని కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ ప్రకాష్ బనావత్ అన్నారు. శనివారం మండలంలోని బాబా పూర్ లో గల మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు మోటివేషనల్ క్లాస్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వార్షిక పరీక్షలు దగ్గరికొస్తున్న కొద్ది పిల్లల్లో అనేక రకాల ఒత్తిడి ,భయం పెరిగి చదివినది గుర్తుకు రాదాని తద్వారా పిల్లలు ఆందోళన చెందడం జరుగుతుందన్నారు.

దీంతోపాటు ఆరోగ్యం క్షమించడం, నిద్ర రాకపోవడం ఎంత చదివినా గుర్తుకు రాకపోవడం జరుగుతుందని తెలిపారు. మానసిక శారీరక ఒత్తిడికి గురవడం వల్ల పరీక్షల్లో ఫెయిలవుతామనే భయం పెరిగి మరింత ఒత్తిడికి లోనవ్వడం వల్ల పరీక్షల్లో విఫలమయ్యే అవకాశం ఉంటుంద తెలిపారు. వీటన్నింటి నుండి బయటపడాలంటే అద్భుతమైన నాలుగు చిట్కాలు పాటించాలని సూచించారు.  పీస్, ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రజెంటేషన్  ఈ నాలుగింటిని పాటిస్తే భయాన్ని ఓడించవచ్చని పి ఫోర్ మంత్రాన్ని బోధించారు.

ఉపాధ్యాయులు సైతం విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి పెట్టకుండా స్నేహపూర్వకంగా విద్యను బోధించినట్లయితే వారిలో మరింత మనో ధైర్యం పెరుగుతుందని పేర్కొన్నారు. పదవ తరగతి పరీక్షల్లో పదికి పది రావాలంటే భయాన్ని విడనాడాలని సూచించారు. విద్యార్థుల మనసులో ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమైన వాటిని నివృత్తి చేసుకునేలా దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సుకన్య, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.