calender_icon.png 24 January, 2026 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తపాలా శాఖ పథకాలను వినియోగించుకోవాలి

24-01-2026 08:57:50 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీములను ప్రజలు వినియోగించుకోవాలని తపాలా శాఖ పాల్వంచ సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ మాలోత్ వీరన్న కోరారు. శనివారం ఆయన ములకలపల్లి లోని సబ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. వివిధ రికార్డులను పరిశీలించారు. ఈ ఆర్థిక సంవత్సరం సాధించిన వివిధ రకాల పథకాలకు సంబంధించిన పురోగతిని ఆయన సమీక్షించారు. పోస్టల్ శాఖ అందించే వివిధ రకాల జీవిత బీమా పథకాలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.

కార్యాలయ సిబ్బంది ఉత్తరాల బట్వాడకు వెళ్లిన సమయంలో తపాలా శాఖ అందించే పథకాలను వివరించి గ్రామస్తులు పోస్ట్ ఆఫీస్ లల్లో ఖాతాలను ప్రారంభించే విధంగా చూడాలని వారికి అవగాహన కల్పించారు. అలాగే కమలాపురం గ్రామంలో సర్పంచ్ వగ్గేల రాధ ఆధ్వర్యంలో పోస్టల్ శాఖ అందించే వివిధ పథకాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామీణ పేదలు ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన, సుకన్య యోజన, ప్రమాద బీమా తదితర పథాకలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ములకలపల్లి సబ్ పోస్ట్ మాస్టర్ కిరణ్ కుమార్, కమలాపురం పోస్టు మాస్టర్ రేపాక శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.