24-01-2026 09:05:35 PM
వనపర్తి టౌన్: రోజు రోజుకు సాంకేతికపరంగా అనేక మార్పులు వస్తున్నాయని, వాటికి అనుగుణంగా విద్యార్థులు సైన్స్ ను అందిపుచ్చుకుని కొత్త ఆలోచనలకు పదును పెట్టాలని స్కూల్ ప్రిన్సిపల్ లవ్లీ బిన్నీ సూచించారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని వల్లబ్ నగర్ గౌతమ్ మోడల్ హైస్కూల్లో వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి 400 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 174 వైజ్ఞానిక ప్రదర్శనలు ఇక్కడ ప్రదర్శించారు.
ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ లవ్లీ బెన్నీ మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచి కొత్త కొత్త ఆలోచనలపై దృష్టి సాధించి సాంకేతిక రంగంలో ఎదగాలన్నారు. సైన్స్ ను అలవర్చుకుంటే జీవితంలో ముందుకు వెళ్ళగలమని చెప్పారు.ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ బెన్నీ జోసెఫ్,మరియు స్కూల్ టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు.