calender_icon.png 24 January, 2026 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాయం

24-01-2026 08:05:33 PM

పినపాక,(విజయక్రాంతి): పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి గ్రామంపంచాయతీలో సుమారు రూ.4 లక్షల 50 వేల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, బోటిగూడెం గ్రామం, బయ్యారం గ్రామపంచాయతీలో రూ.6 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన, పాతిరెడ్డి పాలెం గ్రామపంచాయతీ పరిధిలో సుమారు రూ.6 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొని అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా ప్రజలకు మరింత సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే  ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంఆర్వో గోంధి గోపాలకృష్ణ, ఎంపీఓ కాంతిపూడు వెంకటేశ్వరరావు, పీఆర్ డీఈ వైశ్య నాయక్, పీఆర్ ఏఈ వంశీ, గ్రామపంచాయతీ కార్యదర్శి ఎస్. ఆదినారాయణ, హౌసింగ్ ఏఈ బురుగు వెంకటేష్, ఐటిడిఎ ఏఈ ఎన్. నరేష్, బయ్యారం సర్పంచ్ బాగబోయిన చందర్ రావు, ఉప్పక సర్పంచ్ మట్టా బాబు రావు, ఉప్పక ఉపసర్పంచ్ కోడెం రామ్మోహన్ రావు, కంది సుబ్బారెడ్డి, గంగిరెడ్డి వెంకటరెడ్డి, గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గంగిరెడ్డి సంజీవరెడ్డి, ఉడుముల లక్ష్మారెడ్డి, బండారు సాంబ, బుల్ రెడ్డి, పొనగంటి మల్లయ్య, పేరం వెంకటేశ్వరరావు తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.