24-01-2026 08:11:51 PM
నంగునూరు,(విజయక్రాంతి): నిజామాబాదులో ఈ నెల 21 నుండి 23 వరకు నిర్వహించిన 69వ SGFI అండర్-17 రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల జెడ్పీహెచెస్ విద్యార్థులు అద్భుత ప్రదర్శన చేసి ద్వితీయ స్థానంలో నిలిచారు.అంతకుముందు మనోహరాబాద్‌లో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి వీరు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.
రాష్ట్ర స్థాయిలో రన్నరప్‌గా నిలిచిన విద్యార్థులు బి. ఈశ్వరి, ఎం. వైష్ణవి, డి. అను, బి. హరిణి ప్రియ, బి. షణ్ముఖ ప్రియ, ఎస్.కిరణ్విలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.రమేష్, గ్రామ సర్పంచ్ ఇంగ నరేష్, ఉప సర్పంచ్ తిప్పని శ్రీను అభినందించారు. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు డి.రాజ్ కుమార్‌ను, విద్యార్థులను ఎస్ఎంసీ చైర్మన్, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు ప్రత్యేకంగా ప్రశంసించారు.