19-07-2025 01:20:22 AM
హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): తాజాగా వెలుగుచూస్తున్న ఆహా ర కల్తీ ఘటనలు, విద్యార్థుల ఆత్మహత్యాయత్నాల నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వ నేతృత్వంలో నడుస్తున్న నాలుగు గురుకుల సంస్థలు విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ మేరకు శుక్రవారం కీలక సమీక్ష నిర్వహించారు. సమ గ్రమైన విధివిధానాలతో విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడే విధంగా అధికారులు నిర్ణయాలు తీసుకున్నారు.
సమావేశంలో ఎస్సీ గురుకుల కార్యదర్శి డాక్టర్ వీఎస్ అలుగు వర్షిణి, ఎస్టీ గురుకుల కార్యదర్శి సీతాలక్ష్మి, బీసీ గురుకుల కార్యదర్శి సైదులు పాల్గొన్నారు. అన్ని రెసిడెన్షియల్ గురుకుల సమితులకు ఒకే సంయుక్త పర్యవేక్షణ వ్యవస్థ, ‘హాస్టల్ భద్రత సెల్’ ఏర్పాటుతో అత్యవసర స్పందన, ఆహార నాణ్యతపై మెస్ మానిటర్లతో విద్యార్థుల పరిశీలన, రోజువారీ పారిశుద్ధ్య తనిఖీలు జరపాలని నిర్ణయించారు.
ప్రతి వంటగదిలో పేస్ట్ కం ట్రోల్, పాడైన ఆహారాన్ని గుర్తించే ఎస్‌వోపీలు, ‘క్వార్టెట్ గ్రూపులు’ ద్వారా మాన సిక ఆరోగ్య పర్యవేక్షణను 4 విద్యార్థుల బృందాలు పరస్పరం గమనించే విధా నం తీసుకురావాలని స్పష్టం చేశారు.
విద్యార్థులుగా తాము భద్రతగా ఉన్నామనే భావన కల్పించే ‘కల్చర్ ఆఫ్ కేర్’ దిశగా చర్యలు, రాత్రి వేళల్లో కూడా బా ధ్యతలతో విధులు నిర్వర్తించే సూపర్‌వైజర్లు, సైకాలజిస్టులతో ఆన్‌లైన్/ ఆఫ్ లైన్ మానసిక కౌన్సిలింగ్ ప్లాన్ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు.
స్వల్ప అస్వస్థతలకు హాస్టల్లోనే ప్రా థమిక చికిత్సా కేంద్రాల ఏర్పాటు, అన్నీ గురుకులాలపై ఆకస్మిక తనిఖీలు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌లు, విద్యార్థులు తినే ఆహారపు నమూనాలను త్రైమాసికంగా ప్ర యోగశాలలకు పంపించాలని ఆదేశించారు.