20-05-2025 12:00:00 AM
పోలీసుల తనిఖీల్లో తేట తెల్లం
నిర్మల్ మే 19 (విజయ క్రాంతి): నిర్మల్ జిల్లాలో దాబాల్లో మద్యం సిట్టింగులు జోరుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రధాన రోడ్లపై ఉన్న దాబాలతో పాటు గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో నిర్వహిస్తున్న దాబా హోటలలో అక్రమంగా మ ద్యం నిలువలు ఉంచి మందు ప్రియులకు కావలసిన మందులు మటన్ చికెన్ ముక్కలను అందిస్తున్నారు. దాబాలో మధ్య నిషే ధం అమలు చేయాలని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెచ్చరించినప్పటికీ చాలా ప్రాంతా ల్లో సాయంత్రం ఐదు నుంచి రాత్రి 12:00 వరకు విందులు వినోదాలకు మద్యం అంది స్తూ దావతులు చేసుకుంటున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో బైంసా బాసర్ మంజులాపూర్ కుబీర్ సారంగాపూర్ సిర్గాపూర్ దివా ర్పూర్ నర్సాపూర్ కల్లూరు తాండ్ర తదితర ప్రాంతాల్లో దాబాల్లో మటన్ చికెన్‌తో పా టు మందు కూడా అందుబాటులో ఉండడంతో మద్యం ప్రియులు దాబా ఓటర్ లోకి చేరి మద్య సేవిస్తున్నారు.
దాబా హోటల్ లో తినే ఆహార పదార్థాలు తప్ప మద్యం విక్రయాలు చేపట్టవద్దని పోలీస్ శాఖ ధాబా యజ మానులకు సూచించిన అవి నామమాత్రంగానే అమలుచేస్తూ గుట్టు చప్పుడు కాకుండా దాబాకు కొద్ది దూరంలో మద్యం నిల్వ ఉంచి ఫ్రిజ్జులు, కూలర్లు భద్రపరుస్తున్నారు దాబా హోటల్లో భోజనానికి వచ్చిన వారు మందు బ్రాండ్లకు ఆర్డర్ ఇవ్వగానే దాన్ని తీసుకొచ్చి కస్టమర్లకు అందించడంతో దాబా హోటల్లో సెట్టింగ్ జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పోలీసుల తనిఖీలు..
నిర్మల్ జిల్లాలోని దాబా హోటల్లో మ ద్యం విక్రయాలు జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు మూడు రోజుల క్రితం అన్ని ప్రాంతాల్లో పోలీసులు దాబాలపై దాడులు నిర్వహించారు. అయితే ప్రతి దాబాలో ఖాళీ మద్యం సీసాలతో పాటు ఫ్రిజ్లో బీర్లు ఇతర మందు బాటిళ్లు నిలువ ఉండడంతో వాటిని సాధించిన దాబాలపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు చెప్తున్నారు.
వైన్ షాప్ రేట్ కంటే 50 రూపాయల ఎక్కు వ విక్రయించడంతో సామాన్య ప్రజల జేబు కు చిల్లులు పడుతున్నాయి. దాబాల్లో మద్యం సేవించడం వల్ల శాంతిభద్రతలకు కూడా విఘాతం కలుగుతుంది గొడవలు జరగడం అల్లర్లు చేయడం రోళ్లపై గచ్చి హంగామా సృష్టించడం తాగి వాహనం నడుపుతూ ప్రమాదాల గురి కావడం వంటివి ప్రతినిత్యం జరగడంతో పోలీసులు దాబా హోటల్లో మందు విక్రయాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టి దాడులు చేసినట్టు చెప్తున్నారు.