17-11-2025 07:59:59 PM
సిద్దిపేట క్రైం: ఇటీవల రోడ్డు ప్రమాదంలో భార్యను కోల్పోయి తీవ్రంగా గాయపడిన ఫొటో జర్నలిస్ట్ రమేశ్ ను ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు. సోమవారం గంగాపురంలో రమేశ్ ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పారు. సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. పుల్లూరు గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు జీకురు పరమేశ్వర్ తల్లి లక్ష్మి ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న ఎంపీ రఘునందన్ రావు సోమవారం పుల్లూరు గ్రామానికి వెళ్లి పరమేశ్వర్ ను పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం లక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీ వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, వేణుగోపాల్, పలువురు నాయకులు ఉన్నా రు.