calender_icon.png 17 November, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: ఎస్సై శివానంద గౌడ్

17-11-2025 08:00:44 PM

రాజాపూర్: మండలంలోని దుందుభి నది పరివాహక ప్రాంతంలో ఎక్కడైనా ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శివానంద గౌడ్ అన్నారు సోమవారం మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహించి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న మూడు ట్రాక్టర్లు ఒక జెసిబి ని పట్టుకొని ట్రాక్టర్ జెసిబి యజమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.