01-07-2025 06:26:14 PM
ఎంపీడీఓ శ్రీనివాస్ రావు..
పెన్ పహాడ్: ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించుకొని తమ ఆరోగ్యాలు బంగారు భవిష్యత్తుకు ఎలా పునరంకితం అవుతున్నారో.. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు అవుతాయో భూగర్భ జలాలతో ఆ ఊరు భవితవ్యానికి మార్గనిర్దేశంగా నిలుస్తుందని ఎంపీడీఓ శ్రీనివాస్ రావు(MPDO Srinivas Rao) అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అనంతారం గ్రామంలో సాచ్యురేషన్ పద్ధతిలో ఇంటింటికి ఇంకుడు గుంతల నిర్మాణం కోసం ముగ్గులు పోసి గ్రామస్తులకు ఇంకుడు గుంతలపై అవగాహన కల్పించారు.
తమ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రభుత్వం రూ. 6 వేలు అందిస్తుందన్నారు. అలాగే ప్రస్తుతం వర్షాకాలం సమీపించినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని కోరారు. గ్రామాల్లో పైపులు లీకేజీ అయిన వెంటనే సిబ్బంది ఎప్పటికప్పుడు పైప్ లైన్ లీకేజీలను మరమ్మతులు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ రవి, ఈసీ మహేష్, ఏకస్వామి, రాంకుమార్, బేగం తదితరులు ఉన్నారు.