calender_icon.png 2 July, 2025 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులంలో సాధారణ ఎన్నికలు తలపించేలా నిర్వహణ

01-07-2025 06:32:03 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని పిటిజి గురుకులం(PTG Gurukulam)లో మంగళవారం స్కూల్, కాలేజ్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. సాధారణ ఎన్నికల మాదిరి నిర్వహించిన స్టూడెంట్ ఎలక్షన్స్ విద్యార్థులలో కొత్త ఉత్తేజాన్ని కలిగించాయి. బ్యాలెట్ పేపర్, పోలింగ్ బూత్, ఇంక్ పెట్టడం ఇలా పూర్తిగా సాదారణ ఎన్నికల మాదిరి ఏర్పాట్లు చేయడంతో గురుకులంలో ఎన్నికల హడావిడి కనబడింది. ఈ ఎన్నికలను ఉమ్మడి ఆదిలాబాద్ గిరిజన గురుకులాల సమన్వయాధికారి అగస్టిన్ ఎన్నికల అధికారి కారం భద్రయ్యతో కలిసి పరిశీలించి సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆర్సివో మాట్లాడుతూ... విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలు అవసరమని అందుకే గురుకులంలో ఎస్పిఎల్, సిపీఎల్, స్పోర్ట్స్, సిక్, కల్చరల్, లైబ్రరీ తదితర విభాగాలలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఎలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో నూతనోత్తేజం కలిగిస్తాయని అన్నారు. గురుకులంలో జరిగిన ఎన్నికలకు మొత్తం 4 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేయగా ఎన్నికల అధికారిగా ప్రిన్సిపాల్ భద్రయ్య వ్యవహరించారు. ఎన్నికల కమిటీ సభ్యులుగా ప్రవీణ్ బాబు, గణేష్, తిరోజ, రూట్ ఆఫీసర్ గా సచిందర్ లు, పివో, ఎపివో, ఓపివో, కౌంటింగ్ అధికారులుగా ఉపాధ్యాయులు వ్యవహరించారు.

ఎన్నికల ఫలితాలు.. కళాశాల నుండి..

సిపిఎల్ గా హరీహరన్, సందీప్ ఫుడ్ లీడర్ గా లక్ష్మణ్, స్పోర్ట్స్ లీడర్ గా లింగారావు, డిసిప్లిన్ లీడర్ గా జంగు, కల్చరల్ లీడర్ గా అనిల్, లైబ్రరీ లీడర్ గా తేజ్ కుమార్ లు ఎన్నికయ్యారు.

స్కూల్ లీడర్ ఎన్నికల ఫలితాలు....

ఎస్పిఎల్ గా నిశాంత్, హనుమంత్, జంగు, దేవాజీ, డిసిప్లిన్ లీడర్ గా అంజన్న, కల్చరల్ లీడర్ గా అజయ్, సంతోష్, క్లీన్ అండ్ గ్రీన్ లీడర్ గా భీమ్ రావు, పవన్ కళ్యాణ్, వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ లీడర్ గా పాపయ్య, రాము, ఫుడ్ లీడర్ గా బీమ్ రావు, ఆకాష్, స్పోర్ట్స్ లీడర్ గా అంజన్న, అరవింద్ లు ఎన్నికయ్యారు.