calender_icon.png 15 September, 2025 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామచంద్రపురంలో ఎమ్మార్పీఎస్ ఆందోళన

15-09-2025 02:49:25 PM

రామచంద్రపురం (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) రామచంద్రపురం మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించి, తాహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు ప్రమోద్ మాదిగ మాట్లాడుతూ... “గత ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పింఛన్ దారులందరికీ పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు గడిచినా ఆ హామీ నెరవేర్చక ప్రజలను మోసం చేస్తున్నారు” అని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులు, చేయూత పొందుతున్న పెన్షనుదారులు, ఒంటరి మహిళలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టే పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు ఎమ్మార్పీఎస్ నాయకులు వికలాంగులు, పెన్షనుదారులు, మహిళలు పాల్గొన్నారు.