15-09-2025 04:27:44 PM
నకిరేకల్ (విజయక్రాంతి): లయన్స్ క్లబ్ అఫ్ కట్టంగూర్ కింగ్స్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కట్టంగూరులోని ఎం ఎస్ ఆర్ గార్డెన్ లో నిర్వహించారు. కట్టంగూర్ క్లబ్ ప్రెసిడెంట్ శేఖర్ చిక్కు, ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ గుడిపాటి, కోశాధికారి రాములు పోగులతో పాటు క్లబ్ కార్యవర్గమును ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సమావేశంలో లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ లయన్ మదన్ మోహన్ రేపాల, ఇన్స్టాలేషన్ ఆఫీసర్, పాస్ట్ జిల్లా గవర్నర్, జి ఎస్ టి కోఆర్డినేటర్ లయన్ అమరేందర్ రెడ్డి గోలి, ఇంటెక్షన్ ఆఫీసర్, జిల్లా ఫస్ట్ వైస్ గవర్నర్ లయన్ కె వి ప్రసాద్, జిల్లా సెకండ్ వైస్ గవర్నర్ లయన్ సతీష్ కుమార్ కోడె, జిల్లా క్యాబినెట్ ట్రెజరర్ గట్టుపల్లి అశోక్ రెడ్డి, రీజన్ చైర్మన్ సంతోష్ కొండ, సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే కంటి హాస్పిటల్ చైర్మన్ గోపాల్ దోసపాటి, జోన్ చైర్మన్ లు శ్రీనివాస్ బుడిగె, లక్ష్మారెడ్డి కొండపల్లి, జిల్లా జీఈటి మెంబర్ శంభు లింగారెడ్డి ఎర్ర, డిస్టిక్ చైర్ పర్సన్ సత్యనారాయణ డెంకల, శ్రీనివాస్ దేవరశెట్టి, నకిరేకల్ లయన్స్ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ పాపిరెడ్డి కందాల, నకిరేకల్ లయన్స్ ట్రస్ట్ చైర్మన్ నెమరుగొమ్ముల రామ్మోహన్, డి సి మెంబర్, ఆర్గానిక్ ఫార్మింగ్ అంజిరెడ్డి ఏదుళ్ళ, నకిరేకల్ క్లబ్ ప్రసిడెంట్ సతీష్ రేపాల, ప్రేమ్ నాథ్ రెడ్డి కందాల, ప్రోగ్రాం చైర్మన్ సాగర్ రెడ్డిపల్లి, క్లబ్ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు కల్లూరి, జాయింట్ కార్యదర్శి వినోద్ కుమార్ బసవోజు, శాలిగౌరారం లయన్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు శేఖర్ బాబు గుజలాల్, శ్రీనివాస్ దామెర్ల, పరమేష్ గుండు,క్లబ్ గ్యాట్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. క్లబ్ జిఎంటి కోఆర్డినేటర్ నవీన్ కక్కిరేణి కట్టంగూర్ కు బాడీ ఫ్రీజర్, స్కూల్ విద్యార్థులకు ఆరు సైకిళ్లు అందజేస్తానని ప్రకటించారు.