calender_icon.png 15 September, 2025 | 5:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

15-09-2025 04:29:51 PM

పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు కుశాల్..

నిజాంసాగర్ (విజయక్రాంతి): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు కుశాల్(PRTU District President Kushal) అన్నారు. సోమవారం మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలో పిఆర్టియు మండల నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ... ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి రావలసిన అన్ని సదుపాయాలను సాధించేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పీఆర్టియు మహమ్మద్ నగర్ మండల అధ్యక్షుడు వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి వెంకట్రాంరెడ్డి, నిజాంసాగర్ మండల అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి సురేందర్ పిఆర్టియు నాయకులు భాస్కర్ గౌడ్, పండరి, జనార్ధన్, కలకొండ నారాయణ, వెంకన్న తదితరులు ఉన్నారు.