calender_icon.png 15 September, 2025 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు నవ్వుకుంటారనే ఆలోచన పార్టీ మారిన ఎమ్మెల్యేలకు లేనట్లుంది

15-09-2025 04:08:17 PM

హైదరాబాద్: పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని విజ్జప్తి చేస్తున్నామని.. 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Former Minister Jagadish Reddyమీడియా సమావేశంలో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణను మాకు తెలియజేశారని, బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం చెప్పాలని మాకు 3 రోజుల గడువు ఇచ్చారని అన్నారు. పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ పార్టీ మారలేదని చెప్తున్నారని.. బీఆర్ఎస్ పై, కేసీఆర్ పై మాకు విశ్వాసం ఉందని స్పీకర్ కు వివరణ ఇచ్చారన్నారు. ప్రజలు నవ్వుకుంటారనే ఆలోచన పార్టీ మారిన ఎమ్మెల్యేలకు లేనట్లుందని.. కాంగ్రెస్ సమావేశాలకు వెళ్తూ బీఆర్ఎస్ లోనే ఉన్నామని అంటున్నారన్నారు. "పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి దొరికిపోయిన దొంగలు.. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి మూటలతో దొరికి తప్పించుకున్నారు.. మేము తప్పించుకోలేమా అని ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు" అని జగదీష్ రెడ్డి అన్నారు. 

పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని.. పదిమంది ఎమ్మెల్యేలు ఇక్కడ తప్పించుకున్నా కోర్టుముందు తప్పించుకోలేరని అన్నారు. ఉప ఎన్నికలు రావడం ఖాయం..  ప్రజలు మీకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయడం ఖాయమని పేర్కొన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరకపోతే.. రాహుల్ గాంధీని, మహేష్ కుమార్ గౌడ్ ను ఎందుకు కలిశారు..? స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఎందుకు మాట్లాడారని తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తే సడెన్ గా సీఎం కండువా కప్పారని చెప్పారు. సంజయ్ పేపర్ ప్రకటనల్లో కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉన్నారు..? గాంధీ భవన్ లో, కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్ లో పాల్గొంటే అభివృద్ధి ఎట్లా అవుతుంది? అని విమర్శించారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో శాసనసభ అదనపు కార్యదర్శి ఉపేందర్ రెడ్డిని కలిసి, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఆధారాలు సమర్పించడం జరిగింది.