15-09-2025 02:46:09 PM
మందమర్రి (విజయక్రాంతి): విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పట్టణానికి చెందిన పెద్దపల్లి సత్యనారాయణను నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చొల్లెటి కృష్ణమాచార్యులు సోమవారం ఉత్తర్వులు జారీ చేసారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర సంఘంలో ప్రాతినిధ్యం కల్పించడం మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. విశ్వ బ్రాహ్మణుల హక్కుల కొరకు, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరంతరం పోరాడుతూ, నిర్దేశిత లక్ష్యాలను సాధించ డానికి తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేములవాడ మదన్ మోహన్, ప్రధాన కార్యదర్శి చొల్లెటి కృష్ణమాచారి లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.