calender_icon.png 15 September, 2025 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు అందుబాటులో ఉండని హాస్టల్ వార్డెన్లను సస్పెండ్ చేయాలి

15-09-2025 04:35:30 PM

తక్షణమే కాస్మొటిక్, మెస్ చార్జీలు ప్రభుత్వం విడుదల చేయాలి..

బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అద్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ

దేవరకొండ (విజయక్రాంతి): ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమ హాస్టల్స్ ను ప్రభుత్వం గాలికి వదిలేసిందని బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ ఆరోపించారు. సోమవారం పత్రిక ప్రకటనలో వారు మాట్లాడుతూ విద్యార్దులకు అందుబాటులో ఉండని హాస్టల్ వార్డెన్లు, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు అని తెలిపారు. తక్షణమే కాస్మొటిక్, మెస్ చార్జీలు ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ హాస్టల్స్ అద్వానంగా మారుతున్నాయని తెలిపారు. కలుషిత ఆహారం తిని విద్యార్దులు ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి అని అన్నారు. మీ పాలన ఎట్లుందో చెప్పడానికి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ హాస్టల్స్ నిదర్శనం అని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం మొద్దునిద్రను వీడి మౌలిక వసతులు కల్పించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని కోరారు.