calender_icon.png 15 September, 2025 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెప్టెంబర్ 17న జిల్లా స్థాయి నేషనల్ సైన్స్ సెమినార్

15-09-2025 03:22:56 PM

హన్మకొండ (విజయక్రాంతి): హన్మకొండలో జిల్లా స్థాయి నేషనల్ సెమినార్ ను ఈ నెల 17న నిర్వహించనున్నట్లు జిల్లా సైన్స్ అధికారి ఎస్. శ్రీనివాస స్వామి(District Science Officer Srinivasa Swamy) ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్, టెక్నాలజికల్ మ్యూజియం బెంగళూరు ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ సెమినార్-2025లో పాల్గొనడం కోసం హనుమకొండ జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో 8 నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారని, జిల్లాస్థాయిలో సైన్స్ సెమినార్ ను హనుమకొండలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల లష్కర్ బజార్ ప్రాంగణంలో గల జిల్లా సైన్స్ కేంద్రంలో "క్వాంటం ఏజ్ బిగిన్స్ పొటెన్షియల్స్ అండ్ ఛాలెంజెస్"అనే అంశంపై నిర్వహిస్తున్నట్లు, దీనికి హాజరు కావాలనుకునే విద్యార్థులు ఉదయం 9: 30 నిమిషాలకు వ్రాతపరీక్షకు హాజరై, ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని, మండలానికి ఒకరికి చొప్పున సెమినార్ లో పాల్గొనుటకు అనుమతించబడుతుందని తెలిపారు.

ముందుగా నిర్వహించే రాత పరీక్ష ఆన్లైన్ లో నిర్వహిస్తారు కావున విద్యార్థులు లేదా గైడ్ టీచర్లు తమ వెంట మొబైల్ ఫోను తీసుకొని రావలసిందిగా సూచించారు. విద్యార్థుల సెమినార్ ప్రదర్శన కు ఆరు నిమిషాల వ్యవధిని కేటాయించగా మౌఖిక ప్రశ్నలకు రెండు నిమిషాల సమయం ఉంటుందన్నారు. సెమినార్ ప్రదర్శనలో భాగంగా విద్యార్థులు తమ వెంట గరిష్టంగా 5 చార్టులు లేదా 5 స్లైడులతో కూడిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకొని రావచ్చని తెలిపారు. జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని ఈనెల 18వ తేదీ న హైదరాబాద్ లోని ఎస్.సి.ఈ.ఆర్.టి నందు నిర్వహించే రాష్ట్రస్థాయి సెమినార్లో పాల్గొనుటకు అర్హత పొందుతారని జిల్లా సైన్స్ అధికారి తెలియజేశారు.