06-07-2025 12:31:55 AM
భారత రెడ్‌క్రాస్ సొసైటీ నుంచి ప్రదానం
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 5 (విజయక్రాంతి): ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందిన దంతవైద్య శస్త్ర వైద్య నిపుణుడు, ఐదు దశాబ్దాలకు పైగా వైద్యసేవలకు గుర్తింపుగా భారత రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతిష్ఠాత్మక ‘మెడికల్ ఎక్సలెన్స్ అవార్డ్2025’ను ప్రొఫెసర్ డాక్టర్ ఎంఎస్ గౌడ్‌కు ప్రదానం చేసింది.
ఈ అవార్డును గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ హైదరాబాద్ సోమాజిగూడలోని సంస్కృతి రాజ్ భవన్ కమ్యూనిటీ హాల్‌లో శనివారం అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. డాక్టర్ గౌడ్ నిస్వార్థంగా ప్రజల కోసం తన జీవితాన్ని అర్పించారని కొనియాడారు.
వారి సేవలు భారత వైద్యరంగానికి వెలకట్టలేని సంపద అని ప్రశం సించారు. కార్యక్రమానికి హైదరాబాద్ కలెక్టర్, భారత రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు హరిచందన దాసరి అధ్యక్షత వహించగా, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఆర్‌సీఎస్ చైర్మన్ ఎం దాన కిషోర్ అతిథిగా హాజరయ్యారు.
ప్రొఫెసర్ శ్రీరాములు (ఐఆర్‌సీఎస్టీ జనరల్ సెక్రటరీ, సీఈవో), డాక్టర్ ఓఎస్ రెడ్డి (ఐఆర్‌సీఎస్‌టీజీ స్టేట్ ట్రెజరర్), డాక్టర్ పి. విజయ్‌చందర్‌రెడ్డి (ఐఆర్‌సీఎస్ వరంగల్ మాజీ నేషనల్ ఎంసీ మెంబర్) గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.