calender_icon.png 4 August, 2025 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో ఉచిత మెగా క్యాన్సర్ పరీక్ష శిబిరం

24-07-2025 05:11:46 PM

రోటరీ అసిస్టెంట్ గవర్నర్ జైపాల్ రెడ్డి..

కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): రోటరీ క్లబ్ కామారెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాన్సర్ పరీక్ష శిబిరం(Cancer Checkup Camp) నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ జైపాల్ రెడ్డి(Rotary Club Assistant Governor Jaipal Reddy) తెలిపారు. జిల్లాలోని ప్రజలు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళాభారతి ఆడిటోరియంలో ఈనెల 26న శనివారం ఉదయం 10-4 వరకు ఉచితముగా మహిళలకు, పురుషులకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

కిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ బృందంచే సుమారుగా రూ. 17,100 విలువగల క్యాన్సర్ టెస్టులు ఉచితంగా చేయబడతాయని తెలిపారు. ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ డా.మధు దేవరశెట్టి, అసిస్టెంట్ గవర్నర్ డా. యం. జైపాల్ రెడ్డి, IMA సెక్రటరీ డా.అరవింద్ కుమార్ గౌడ్, డా. గీరెడ్డి రవీందర్ రెడ్డిలు పాల్గొంటున్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా ప్రజలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మహిళలు, సోషల్ ఆర్గనైజేషన్ టీమ్స్, సమాజం పట్ల బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ హెల్త్ క్యాంపు గురించి తెలియపరచ గలరని రోటరీ ప్రెసిడెంట్ వై. శంకర్, సెక్రెటరీ ఎస్. కృష్ణ హరి, ట్రెజరీ వెంకట రమణ, నాగభూషణం, దత్తాత్రి తెలిపారు.