calender_icon.png 7 July, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెంపుడు జంతువులకు వ్యాక్సిన్ వేయించండి

07-07-2025 01:51:14 AM

వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి

చేవెళ్ల, జూలై 6:పెంపుడు పిల్లులు, కుక్కలకు రేబిస్ వ్యాక్సిన్ వేయించాలని వెటర్నరీ, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి సూచించారు. ఆదివారం వరల్ జూనోసిస్ డే సందర్భంగా చేవెళ్ల పశువైద్యశాలలో ఉచిత రేబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా12 కుక్కలు , 2 పిల్లులకు రేబిస్ వ్యాక్సిన్ వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  రేబిస్ జంతువుల ద్వారా మానవులకు సంక్రమించే అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటని, దీని నివారణకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమన్నారు. ఉచిత వ్యాక్సినేషన్ నిరంతరంగా కొనసాగుతుందని, తమ పెం పుడు జంతువులకు తప్పనిసరిగా రేబిస్ వ్యాక్సిన్ వేయించాలనికోరారు.