calender_icon.png 7 July, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖర్జీ ఆశయసాధనే లక్ష్యం!

07-07-2025 01:08:18 AM

- రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కష్టపడాలి

- శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు

- కార్యక్రమానికి హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): కేంద్ర మాజీమంత్రి, జనసంఫ్‌ు వ్యవస్థాపకుడు డా.శ్యామాప్రసాద్ ముఖర్జీ దేశ సమ గ్రత కోసం, కశ్మీర్ సమస్య పరిష్కారం కో సం చేసిన పోరాటం ఎంతో గొప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు పేర్కొన్నారు.

ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు ఉండకూడదని ఆయన చేసిన పోరాటం తమకు స్ఫూర్తినిచ్చిందన్నారు. ఆయన ఆశయ సాధనకోసం పార్టీ శ్రేణులందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ర్టంలో పార్టీ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని సూ చించారు. ఆర్టికల్ 360ను ఆయన వ్యతిరేకించారని..ఇప్పుడు ప్రధాని మోదీ ఆ ఆర్టిక ల్‌ను తొలగించి ఆయనకు ఘననివాళి ఇచ్చినట్లు తాము భావిస్తున్నామన్నారు.

శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా దేశ సమగ్రత, ఐక్యతకు అందరూ పాటుపడాలన్నారు. కేంద్ర మాజీమంత్రి, జనసంఫ్‌ు వ్యవస్థాపకుడు డా.శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే రేషన్, ఒకే ఎన్నికలు అనే భావాలు శ్యామాప్రసాద్ ఆలోచనలు నుంచి వచ్చినవేనని తెలిపారు. జనసంఫ్‌ు స్థాపించి ప్రజల కోసం పోరాడారని గుర్తుచేశారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకొని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఆదివారం సాయంత్రం ఎంపీ డా. కె లక్ష్మణ్ డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల సందర్భంగా పార్టీ రాష్ర్ట కార్యాలయంలో నివాళులు అర్పించారు.