calender_icon.png 7 July, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలి ఏకాదశికి భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు

07-07-2025 01:09:00 AM

బారులు తీరిన భక్తులు 

ఖమ్మం, జూలై 6(విజయ క్రాంతి ): హిందువుల మొదటి పండుగ ఐన తొలి ఏకాదశికి ఖమ్మం జిల్లా లోని ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. ఈ రోజు నుండి ఈ ఏడాది పండుగలు ప్రా రంభమవుతాయి. ఈ రోజు నుండి శ్రీ మహా విష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉం టారని పండితులు చెబుతారు. వేకువ జాము నుండి వైష్ణవ దే వాలయాల్లో ప్రత్యేక హోమాలు, అలంకరణలు, తదితర పూజా కార్యక్రమాల నిర్వహించారు.

ఖమ్మం పట్టణంలో ని గుట్టమీద ఉన్న శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో స్వామి వారికి, అ మ్మ వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, స్వామి వారికి అమ్మవారికి వైభవంగా క ళ్యాణం నిర్వహించారు. లాకారం, పర్ణశాల వద్ద గల రామాలయాల్లో, ఖానపురం, రావిచేట్టు బ జార్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వా మి వారి ఆలయాల్లో, మధురనగరలోని సాయిబాబా ఆలయంలో, రోటరీనగరలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో, జిల్లాలోని వివిధ ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామి వారిని, అమ్మవార్లను దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

తెలంగాణ తిరుపతి ఐన జామలాపురంలోతెలంగాణ తిరుపతి ఐన జామలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వేకువజాము నుండి స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి,అమ్మ వారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదలు స్వీకరించారు.