07-07-2025 01:07:36 AM
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 6 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 800 మెగావాట్ల సామర్థ్యాన్ని గల అన్ని వనరులు ఉన్నాయని, తక్కువ ఖర్చుతో ప్లాంట్ నిర్మాణం పూర్తవుతుందని 8వ కర్మగారం సాధన కమిటీ నాయకులు జమ్ముల సీతారామరెడ్డి ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క ను కోరారు. ఆదివారం మధిర కాంప్ కార్యాలయంలో ఆయన మంత్రని మర్యాద పూర్వ కంగా కలిశారు.
ఈ సందర్భంగా పాల్వంచ లో కొత్త 8వ దశ ధర్మల్ ప్లాంట్‌ని ఏర్పాటు చేయవలసిందిగా, దానికి కావాల్సిన వనరులు సమృద్ధిగా ఉన్నాయని వివరించడం జరిగింది. మంత్రి సానుకూలంగా స్పందించి మీ అందరినీ కలిసి చర్చిస్తానన్నారు. అతి త్వ రలో సీతారాం రెడ్డి, బట్టి తో అపాయింట్మెం ట్ తీసుకుని ఎనిమిదో దశ సాధన సమితితో కర్మాగార సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నారు.