13-12-2025 12:00:00 AM
మణుగూరు, డిసెంబర్ 12,(విజయక్రాంతి) : మండలంలో మేజర్ గ్రామపంచాయతీ సమితి సింగారం నుం డి అధికార పార్టీ కాంగ్రెస్ నుండి గెలుపొందిన సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్ శుక్రవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఆయన క్యాంపు కార్యాలయం ప్రజాభవన్ లొ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూత నంగా గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్ లను అభి నం దించారు.
పంచాయతీలొ ప్రజలకు అందుబాటులో ఉంటూ సుపరిపాలన అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శివ సై దులు,సీనియర్ నాయకులు దొబ్బల వెంకటప్పయ్య,సామా శ్రీనివాసరెడ్డి, ఎస్ గణేష్ రెడ్డి, చారీ, బొజ్జా త్రిమూర్తులు, యాకూబ్ అలీ, బుర్ర సదానందం, నీలకంఠే శ్వర స్వామి ఆలయ చైర్మన్ కూచిపూడి బాబు, మహిళా నాయకులు ఆముదాల సరస్వతి, వేముల స్వరూప, మంగమ్మ, దేవి, మౌనిక, సరస్వతి పాల్గొన్నారు.