29-10-2025 08:07:38 PM
ఎమ్మార్వో మంగా..
మఠంపల్లి: మొంథా తుఫాన్ ప్రభావంతో మఠంపల్లి మండలంలో భారీ వర్షాలు కురిశాయి. దీని కారణంగా మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో నీటి ఉద్ధృతి పెరిగి రాకపోకలకు అంతరాయం కలిగింది. మఠంపల్లి ఎమ్మార్వో మంగా మఠంపల్లి నుండి రఘునాథ పాలెం పొయ్యే మార్గంలో కప్పల వాగును, చౌటపల్లి చెరువు అలుగును పరిశీలించారు. అనంతరం ఎమ్మార్వో మంగా మాట్లాడుతూ వెళ్లే రోడ్డుపై నీటి ఉద్ధృతి ప్రమాదకరంగా పెరగడంతో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని, కరెంట్ స్తంభాలు, పాడుబడ్డ గృహంలో దగ్గరలో ఉండకూడదని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదని సూచించారు. వారి వెంట ఆర్ఐలు జానిపాషా, శివ, జిపిఓలు, కార్యదర్శి ఉన్నారు.