31-01-2026 07:37:00 PM
- 49వ వార్డు అభ్యర్థుల వాగ్వివాదం
- ఆస్తుల వివరాలు సరిగ్గా లేవంటూ ఒక అభ్యర్థి ఫిర్యాదు
- ఆర్థరైజేషన్ లేనిది రాకూడదంటున్న మున్సిపల్ కమిషనర్ రామాంజుల రెడ్డి
మహబూబ్ నగర్(విజయక్రాంతి): పాలమూరు కార్పొరేషన్ ఎన్నికలలో బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు శుక్రవారంతో ముగిసిన విషయం తెలిసిందే. శనివారం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ పత్రాల స్క్రూట్ ని నిమిత్తం అభ్యర్థులతో పాటు వారికి ఆర్థరైజేషన్ ఇచ్చిన అభ్యర్థులను ఒకరు హాజరుకావాలని మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి తెలియజేశారు. ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో 49 వ వార్డు కు సంబంధించి ఒక అభ్యర్థిపై మరో అభ్యర్థి ఆస్తుల వివరాలు సరిగ్గా రాయలేదని, మరో పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని న్యాయవాదితో స్క్రూట్ ని జరుగుతున్న హాల్లోకి ప్రవేశించారు.
రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి మరో అభ్యర్థి అయిన ప్రసన్న ఆనంద్ గౌడ్ నామినేషన్ పత్రాన్ని పూర్తిస్థాయిలో తనిఖీలు చేసి రిజెక్ట్ చేయాలని కోరినట్లు తెలుస్తుంది. నియమ నిబంధనలు పాటించాలని చెబుతున్న చట్ట ప్రకారం అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని స్క్రూట్నీలో రిజెక్ట్ చేయాలని రాఘవేంద్ర రాజు తో పాటు అతనితో వచ్చిన న్యాయవాది ఆర్వోను ప్రశ్నించారు. అక్కడే ఉన్న ఆనంద్ గౌడ్, రాఘవేంద్ర రాజు ఇరువురు కొంత ఆవేశంగా మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది.
నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆర్ఓ పూర్తిస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని మున్సిపల్ కమిషనర్ రామాంజుల రెడ్డి వివరణ ఇచ్చారు. ఆర్థరైజేషన్ లేనిది ఎవరు కూడా రాకూడదని, వెంటనే యాక్షన్ తీసుకోవాలని సీఐ అప్పయ్యను మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. వెంటనే సీఐ అప్పయ్య స్పందించి అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా ఇరువురుని బయటికి పంపించారు. దీంతో సమస్య సద్దుమణిగింది. ఇరువురు అభ్యర్థుల సైతం కాంగ్రెస్ పార్టీకి చెందినవారు.