31-01-2026 07:33:34 PM
నిజామాబాద్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున జిల్లా కలెక్టరేట్ నందు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని. తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు. జిల్లా ప్రజలు, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.