calender_icon.png 11 July, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుకాణాలపై మున్సిపల్ అధికారుల దాడులు

10-07-2025 07:43:18 PM

ప్లాస్టిక్ వాడుతున్న దుకాణాలకు రెండు వేల జరిమానా..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): నల్గొండ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ వాడుతున్న దుకాణాలపై గురువారం మున్సిపల్ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. పట్టణంలోని ఆర్పీ రోడ్ లోని పలు చికెన్ సెంటర్ తో పాటు కిరాణం దుకాణాలలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్(Municipal Commissioner Syed Musab Ahmad) ఆదేశాల మేరకు అదనపు కమిషనర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 120 మైక్రాలకు తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను వాడుతున్న రెండు దుకాణాలకు 2000 చొప్పున జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ, ప్లాస్టిక్ భూతం రోజురోజు పర్యావరణాన్ని కలుషితం చేస్తుందని అన్నారు.

ప్రతి ఒక్కరు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 120 మైక్రాలకు పైబడిన ప్లాస్టిక్ నే వాడాలని సూచించారు. పట్టణంలో అన్ని దుకాణాలపై దాడులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్లాస్టిక్ రైతు సమాజ నిర్మాణం కోసం సాగే కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట శానిటరీ ఇన్స్పెక్టర్లు నంద్యాల ప్రదీప్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.