calender_icon.png 11 July, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిల్డింగ్ పై నుండి పడి కార్మికుడు మృతి

10-07-2025 07:41:13 PM

మేడిపల్లి (విజయక్రాంతి): ఫోన్ మాట్లాడుతూ బిల్డింగ్ పై నుండి పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వీరారెడ్డి నగర్ రోడ్ నెంబర్ 13లో బిల్డింగ్ నిర్మాణంలో సెంట్రింగ్ పని చేస్తూ అదే బిల్డింగ్ లో మహారాష్ట్రకు చెందిన దయానంద్(32), బ్రాహ్మణ్ గౌండ్(20) తో కలిసి ఉంటున్నాడు. బుధవారం రాత్రి బ్రాహ్మణ్ గౌండ్ కింద ఫ్లోర్ లోకి వెళ్లి నిద్రపోతుండగా, ఆ సమయంలో దయానంద్ బిల్డింగ్ పైకి వెళ్లి ఫోన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు జారీ క్రిందపడి మరణించాడు. ఉదయం లేచిన గౌండ్ దయానంద్ కోసం వెతుకుతుండగా బిల్డింగ్ వెనక చనిపోయి కనిపించాడు, వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి బంధువులకు అప్పగించామని పోలీసులు తెలిపారు.