calender_icon.png 22 July, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ముందుచూపుతోనే విద్యుత్ వెలుగులు

19-07-2025 01:26:50 AM

ఈ రంగంలో దేశానికే తెలంగాణ దిక్సూచీ 

భవిష్యత్తును ఊహించి నాగార్జున సాగర్ నిర్మాణం

  1. రాబోయే రోజుల్లో విద్యుత్‌కు డిమాండ్ 
  2. రాష్ట్రంలో అవసరాలను అధిగమిస్తాం
  3. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  4. హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై సమీక్ష 

నాగార్జునసాగర్, జూలై 18: నాడు కాంగ్రెస్ ముందుచూపుతోనే నేడు విద్యుత్ వెలుగులు వస్తున్నాయని, ఈ రంగంలో దేశానికే తెలంగాణ దిక్సూచీగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భవిష్యత్తును ఊహించే కాంగ్రెస్ పార్టీ నాడు నాగార్జున సాగర్ నిర్మాణం చేపట్టిందన్నారు. రాబోయే రోజుల్లో విద్యుత్‌కు డిమాండ్ పెరిగినా.. రాష్ట్రంలో అవసరాలను అధిగమిస్తామని చెప్పారు.

శుక్రవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ఆయన పర్యటించారు. నాగార్జునసాగర్ జెన్కో పవర్ హౌస్‌లో రాష్ట్రంలోని హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. అధికారులు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశా రు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడు తూ.. అన్ని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్‌లలోని అన్ని యూనిట్లు వినియోగంలో తీసుకురావాలన్నారు.

పవర్ ప్రాజెక్టు యూనిట్లు ఆలస్యం కాకుండా చూసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో నిర ్లక్ష్యం ఉండవద్దని సూచించారు. ప్రాజెక్టుల పనుల పురోగతిని సమీక్షించేందుకు ప్రణాళిక తయారు చేయాలని, ఇందుకొక క్యాలెండర్‌ను రూపొందించాలని ఆదేశించారు. ఏ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో దాని ప్రకారం ప్రతి వారం సమీక్షించాలని కోరారు.

ఏటా విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నదని, సంవత్సర కాలంలోనే 2000 మెగావాట్ల  పవర్ డిమాండ్ పెరిగిందని, పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతేడాది మార్చి 24న 308.45 మిలియన్ యూనిట్ల కరెంట్ సరఫరా చేయగా.. ఈ ఏడాది 18 మార్చిన 335 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేసినట్లు తెలిపారు.

రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక మని భట్టి చెప్పారు. గత ఏడాది మార్చి 8న 15,497 మెగావాట్ల హైడిమాండ్ ఏర్పడగా.. ఈ ఏడాది మార్చి 20న 17,162 మెగావాట్ల డిమాం డ్ ఏర్పడిందని చెప్పారు. సుమారు 2000 మెగావాట్ల అదనపు డిమాండ్ ఉన్నప్పటికీ సెకన్ కూడా విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

గడచిన సంవత్సరం కాలంలో జెన్కో సిబ్బంది ఒక పద్ధతి ప్రకారం పనిచేయడం వల్ల ఎలాంటి బ్రేక్ డౌన్లు, విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్ ను అందించగలిగామని, ఇందుకుగాను ఆయన శాఖలోని అధికా రులు, సిబ్బందిని అభినందించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్రానికి భారంగా మారాయని భట్టి విక్రమార్క ఆరోపించారు.

గతంలో శ్రీశైలంపైన ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు కడుతుంటే అడ్డుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం సహకరించిందని మండిపడ్డారు. సమావేశంలో జెన్కో సీఎండీ డాక్టర్ హరీ, కలెక్టర్  ఇలా త్రిపాఠి, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేలు జైవీర్‌రెడ్డి, బత్తు ల లక్ష్మారెడ్డి, బాలు నాయక్ , ఎమ్మెల్సీ శంకర్ నాయక్, అదనపు కలెక్టర్లు జే. శ్రీనివాస్, నారాయణ అమిత్ పాల్గొన్నారు.