13 April, 2026 | 6:43 AM

అమెరికాలో భారతీయుడి హత్య

18-08-2024 01:40 AM

వాషింగ్టన్, ఆగస్టు 17: ఆమెరికాలో ఓ బాలుడు దొంగతనం చేస్తూ అడ్డుకోబోయిన భారతీయుడిని కాల్చి చంపాడు. ఉత్తర కరోలినాలోని 2580 ఎయిర్‌పోర్టు రోడ్డులో మైనాంక్ పటేల్ అనే వ్యక్తి టొబాకో హౌస్ పేరుతో కన్వీనియన్స్ స్టోర్ నడుపుతున్నాడు. గత మంగళవారం ఆ స్టోర్‌లోకి చొరబడిన ఓ బాలుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అతడిని పటేల్ అడ్డుకొనే ప్రయత్నం చేయటంతో కాల్పులు జరిపాడు. దీంతో మైనాంక్ పటేల్ తీవ్రంగా గాయపడి ఆ తర్వాత మరణించినట్టు సాలిస్‌బరీ పోస్ట్ అనే పత్రిక తెలిపింది. బాలుడిని అరెస్టుచేసి జువెనైల్ హోమ్‌కు తరలించినట్టు రోవన్‌కౌంటీ పోలీసులు వెల్లడించారు.