15-09-2025 12:13:34 AM
మంథని, సెప్టెంబర్13 (విజయక్రాంతి): మంథని రెడ్డి సేవాసంక్షేమ సంఘం అధ్యక్షులుగా ముస్కుల సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం ముంథని పట్టణంలోని రెడ్డి సంఘం భవనంలో ఎన్నికలు నిర్వహించారు. గౌరవ అధ్యక్షులుగా మందల సత్యనారాయణ రెడ్డి,అధ్యక్షులుగా ముస్కుల సురేందర్ రెడ్డి,ఉపాధ్యక్షులుగా కర్క కొండారెడ్డి, ప్రదాన కార్యదర్శిగా ఎలుక సత్యనా రాయణ రెడ్డి, సహయ కార్యదర్శిగా ముసిపట్ల రమణారెడ్డి,మూల శేఖర్ రెడ్డి,కార్యవర్గ స భ్యులుగా లంబు ప్రభాకర్ రెడ్డి,అల్ల రమణారెడ్డి,గంట్ల పురేందర్ రెడ్డి మారం సత్య నారా యణ రెడ్డి, రిక్కీల కిషన్ రెడ్డి,మాసిరెడ్డి రాజి రెడ్డి ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా చందుపట్ల సుధాకర్రెడ్డి వ్యవహరించారు. సహయమలుగా చెల్లంకొండ గిరి ధర్ రెడ్డి, గట్ల భరత్ రెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంఘం బలో పేతానికి మంత్రి శ్రీధ ర్ బాబు, శ్రీను బాబు సహకారంతో మీ అం దరి సహకారంతో కృషి చేస్తానన్నారు. నూ తన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.