calender_icon.png 15 September, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు ప్రారంభం

15-09-2025 12:15:07 AM

కరీంనగర్, సెప్టెంబరు 15 (విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రోలెర్స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి హాజరై పోటీల ను ప్రారంభించి మాట్లాడారు.

క్రీడల వలన విద్యార్థులకు ఎన్నో లాభాలు కలుగుతాయని, ముఖ్యంగా వారికి ఒత్తిడి నుంచి ఉప శమనం పొందడమే కాకుండా మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఏ.విజయభా స్క ర్, జిల్లా శాఖ అధ్యక్షులు గట్టు అనిల్ కు మా ర్ గౌడ్, ఉపాధ్యక్షులు వీరన్న, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, తదితరులుపాల్గొన్నారు.